1) టిటిడి "శ్రీవాణి ట్రస్ట్"(శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్) ముసుగులో వెంకన్న భక్తుల నిలువుదోపిడీ!!నవీన్
2)తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాలను వ్యాపార దృక్పథంతో చూడడం మహా అపచారం,పాపం కాదా??
3) శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి విఐపి దర్శనం10,000 కు అమ్మి నిధులను సేకరించి దేవాలయాలను నిర్మించమని టీటీడీ అధికారులను ఎవరు అడిగారు??
4) రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో స్థానిక దాతల సహకారంతో, తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో ఇప్పటికే ఎస్సీ,ఎస్టి కాలనీలలో దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నది వాస్తవం కాదా??
5)టిటిడి లో ఇప్పటికే (సిజిఎఫ్) కామన్ గుడ్ ఫండ్ కింద దేశవ్యాప్తంగా దేవాలయాలు కళ్యాణ మండపాలు సమాచార కేంద్రాలు నిర్మిస్తున్న విషయం అధికారులకు తెలియదా?? 6)టీటీడీలో అధికారులు మారినప్పుడల్లా సొంత "మార్క్" కోసం టిటిడిని ప్రయోగశాలగా మార్చకండి శ్రీవారి భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడకండి!!
7)రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ (ఎండోమెంట్స్) ఉంది కదా?? వారు దేవాలయాలను నిర్మించడం లేదా??దేవాదాయశాఖ చేయాల్సిన ఫని టిటిడి చేయడంలోని మతలబు ఏమిటి??
8) ఏపీఎస్ ఆర్టిసి లా టిటిడి ని కూడా ప్రభుత్వం లో విలీనం చేసే కుట్ర జరుగుతుందా??శ్రీవారి హుండీ పై కన్నేశారా?? అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయి!!
9)టీటీడీ అనుబంధ ఆలయాలను,అర్చకులను పట్టించుకోకుండా సవతి తల్లి ప్రేమ చూపే టిటిడి ఐఎఎస్ అధికారులు ఉన్నపళంగా దేశవ్యాప్తంగా ఎవరు మెప్పు కోసం దేవాలయాలను నిర్మిస్తాం అని ట్రస్ట్ పేరుతో నిధులు సేకరిస్తున్నారో భక్తులకు సమాధానం చెప్పాలి!!
10) శ్రీవారి సామాన్య భక్తుల కోసం విఐపి L1,L2 దర్శనాలు రద్దు చేశామని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికి అదే విఐపి దర్శనాలను తిరిగి 10 వేలకు అమ్మడం ధర్మమా??
11)శ్రీవాణి ట్రస్ట్ కారణంగా భవిష్యత్తులో శ్రీవారి "హుండీ ఆదాయం" గణనీయంగ తగ్గిపోతుంది!!టిటిడి కి Fixed డిపాజిట్లు ద్వారా వచ్చే వడ్డీ తగ్గిపోతే సేవా కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది!!
12)టీటీడీ లో ఎప్పటి నుంచో అమలు అవుతున్న"అన్న ప్రసాదం" "ఆరోగ్య వరప్రసాదిని" "గో సంరక్షణ" "ప్రాణదానం" "విద్యా దానం" "వేద పరిరక్షణ" లాంటి ట్రస్ట్ లకు భక్తులు సమర్పించే విరాళాలు గణనీయంగా తగ్గిపోవడం తధ్యం!!
13) తిరుమలలో విఐపి బ్రేక్ 500 రూ టికెట్ ను గతంలో బ్లాక్ లో పదివేలకు అమ్మితే వారిని "దళారీలు" అన్న టిటిడి పెద్దలు మరి అదే 500 రూ బ్రేక్ టికెట్ ను 10000 వేలకు అమ్మడాన్ని ఏమని పిలవాలి?? "ఇల్లీగల్" ను "లీగల్" చేసినట్లు కాదా??
14)రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ కు సంబంధించిన శ్రీశైలం, కనకదుర్గమ్మ,కాళహస్తి కాణిపాకం లాంటి దేవాలయాల నిధుల ద్వారా ఆయా జిల్లాలలో దేవాలయాలు నిర్మించుకోవచ్చు కదా?? కేవలం టిటిడి మాత్రమే ఎందుకు శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ దర్శనాల పేరుతో అత్యుత్సాహం చూపిస్తున్నది??
15)హిందువుల ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక రాజధాని తిరుమల శ్రీవారి సన్నిధిని వ్యాపార కేంద్రంగా మార్చేస్తున్నా మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారు??
16) దేశ వ్యాప్తంగా వున్న మఠాధిపతులు పీఠాధిపతులు దేవాలయాల నిర్మాణానికి విరాళాలు ఎందుకు ఇవ్వడం లేదు??
17)శ్రీవాణి ట్రస్ట్ పై శ్రీవారి భక్తుల,స్థానికుల టిటిడి ఉద్యోగస్తుల అభిప్రాయ సేకరణ జరగాలి తర్వాత
టీటీడీ ధర్మకర్తల మండలిలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని శ్రీ వాణి ట్రస్టు ద్వారా అటు భక్తులకు టీటీడీ ధార్మిక సంస్థకు జరిగే నష్టాన్ని గుర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా టీటీడీ చైర్మన్ స్పష్టమైన ప్రకటన చేయాలి!!
🙏ఓం నమో వెంకటేశాయ గోవిందా🙏
నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తులు
Tirumala Allah Allah Nirman Peru Tu Dopidi